01-09-2025 01:04:29 AM
పదివేల రూపాయలు సాయమందించిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు
ధర్మపురి, ఆగస్టు31(విజయక్రాంతి):జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గములో కుక్కలు రెచ్చిపోతున్నాయి.మనుషులను కరవడమే కాకుండా ఏకంగా పశువుల మందలపై కూడా దాడికి పాల్పడుతున్నాయి. బుగ్గారం మండలంలోని సిరికొండ గ్రామంలో నక్క కొమురయ్య మేకల మందపై కుక్కలు మూకుమ్మడి దాడి నిర్వహించాయి.ఈదాడిలో 13మేకలు పశువుల దొడ్డిలోనే మృతి చెందాయి.
దీనితో పశువుల భాధితుడు కొమురయ్య కన్నీటి పర్యంతమయ్యాడు.విషయాన్ని తెలుసుకున్న మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వేముల సుభాష్ ఆదివారం సంఘటన స్థలానికి వెళ్లి కొమురయ్యను పరామర్శించి తక్షణ సహాయంగా భాధితుడికి 10 పదివేల రూపాయల ఆర్థిక సాయం అందించారు.
బిజీ ఉన్న కూడా చరవాణిలో అందుబాటులో మంత్రి అడ్లూరి!
ఆదివారం అసెంబ్లీ సమావేశ హడావిడి ఉన్నప్పటికీ చరవాణిలో బాధితుడు కొమురయ్యను రాష్ట్ర సంక్షేమ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఓదార్చారు. ప్రభుత్వం తరుపున అండగా ఉంటామనీ, వెంటనే జిల్లా కలెక్టర్ తో మాట్లాడి నష్ట పరిహారం అందేలా చర్యలు తీసుకుంటామనీ మంత్రి భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షులు నర్సాగౌడ్, మాజీ సర్పంచులు,నాయకులుపాల్గొన్నారు.