calender_icon.png 11 October, 2025 | 4:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వైద్య వృత్తిలో నైతిక విలువలు పాటించాలి

11-10-2025 12:45:02 AM

మేడ్చల్, అక్టోబర్ 10(విజయ క్రాంతి): వైద్య వృత్తిలో నైతిక విలువలు పాటించాలని ఎంబీబీఎస్ పూర్తి చేసి పట్టా అందుకున్న యువ వైద్యులకు బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రి సీఈవో డాక్టర్ కే కృష్ణయ్య సూచించారు. మేడ్చల్ మండలం ఘనపూర్ లోని మెడిసిటీ మెడికల్ సెన్సైస్ ఇన్స్టిట్యూట్లో 2019 బ్యా విద్యార్థుల స్నాతకోత్సవానికి  ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆపదలో ఉన్న పేద ప్రజలకు మానవతా దృక్పథంతో వైద్య సేవలు అందించాలన్నారు. వైద్యుడికి డబ్బు ప్రధానం కాదని, రోగులకు వైద్యం అందించడమే సంతోషాన్ని ఇస్తుందన్నారు. వైద్యుడి పట్ల రోగులకు నమ్మకం అవసరమని, నమ్మకం కోల్పోతే అనేక దుష్పరిమానాలకు దారితీస్తుందన్నారు. వైద్య వృత్తి ఎంతో పవిత్రమైనదని, ప్రాణాలు కాపాడేదని గుర్తుంచుకోవాలన్నారు.

మెడిసిటీ ప్రెసిడెంట్ ప్రొఫెసర్ జయ శివరామకృష్ణ మాట్లాడుతూ మంచి వైద్యులుగా సమాజంలో గుర్తింపు తెచ్చుకోవాలన్నారు. మా సంస్థ నుండి డాక్టర్లుగా తయారైనందుకు మేమెంతో గర్విస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ దేవేంద్ర సింగ్ నేగి, ప్రొఫెసర్ ఈనాక్షి తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ శరత్, డాక్టర్ సాక్షి, డాక్టర్ నికిత, డాక్టర్ యశ్వంత్, డాక్టర్ ఐశ్వర్య, డాక్టర్ ఆకాంక్ష కు బంగారు పతకాలు అందజేశారు. కోర్సు పూర్తి చేసిన వారందరికీ సర్టిఫికెట్లు ప్రధానం చేశారు.