calender_icon.png 20 September, 2025 | 10:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థులు మట్టిలో మాణిక్యం లాగా మెరవాలి.!

20-09-2025 07:54:41 PM

- తల్లిదండ్రులు అధ్యాపకుల పేరు నిలబెట్టాలి. 

- సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది.. టియుడబ్ల్యూజే (ఐజేయు) రాష్ట్ర కార్యదర్శి మధు గౌడ్. 

- టియూడబ్ల్యూజే ఆధ్వర్యంలో డిగ్రీ కళాశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు

నాగర్ కర్నూల్ (విజయక్రాంతి): విద్యార్థులు తల్లిదండ్రులతో పాటు అధ్యాపకులు ఆశయాలకు అనుగుణంగా ఒక లక్ష్యాన్ని ఏర్పర్చుకొని లక్ష్యం దిశగా కష్టపడి చదివి మట్టిలో మాణిక్యం లాగా మెరవాలని, తెలంగాణ సాంస్కృతి సాంప్రదాయాలను కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉన్నదని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ సంఘం రాష్ట్ర కార్యదర్శి గుండ్రాతి మధు గౌడ్ పిలుపునిచ్చారు. శనివారం జిల్లా కేంద్రంలోని నెల్లికొండ ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో టియుడబ్ల్యూజె(ఐజేయు) పట్టణ కమిటీ, కళాశాల ఉమెన్ ఎంపవర్మెంట్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ సంబరాల్లో ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి కాసేపు బతుకమ్మ ఆడుతూ పాడుతూ విద్యార్థులను ఉత్తేజపరిచారు. అనంతరం ఆ సంఘం పట్టణ అధ్యక్షుడు బొడ్డుపల్లి మల్లయ్య అధ్యక్షతన ఏర్పాటు చేసిన వేదికపై ప్రసంగించారు.

విద్య అనేది పేదరికం డబ్బుతో సంబంధం లేదని రాజ్యాంగం ప్రతి ఒక్కరికి చదువుకునే హక్కు కల్పించిందన్నారు. ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకొని ఆ లక్ష్యం దిశగా అడుగులు వేయాలన్నారు. ప్రస్తుత స్మార్ట్ ఫోన్ యుగంలో మంచి చెడులు రెండు ఉన్నాయని అందులో మంచి అంశాలను మన ఎదుగుదల కోసం ఉపయోగించుకొని ఉన్నత శిఖరాలను తాకేందుకు స్మార్ట్ ఫోన్ వినియోగించుకోవాలన్నారు. తల్లిదండ్రులను, ఊరిని గురువులకు పేరు తెచ్చే విధంగా ఉన్నతమైన స్థానానికి ఎదగాలన్నారు. అంతకుముందు డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ మదన్ మోహన్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో కళాశాలల్లో నిర్వహించే ప్రతి కార్యక్రమాన్ని సమాజానికి తెలిపేందుకు మీడియా ఎంతగానో పనిచేస్తుందని అందులో భాగంగా కళాశాల వేదికగా టీయూడబ్ల్యూజే ఐజేయు జర్నలిస్టు సంఘం ఈ బతుకమ్మ సంబరాలు నిర్వహించడం ఎంతో ఉత్తేజాన్ని నింపిందన్నారు. అంతకుముందు జిల్లా కార్యదర్శి సురేష్ కుమార్ మాట్లాడుతూ ఎంతో ఆహ్లాదకరమైన ఈ వాతావరణం బతుకమ్మ సంబరాలకు వేదిక అయ్యిందన్నారు.

అంతకుముందు పట్టణ అధ్యక్షులు బొట్టుపల్లి మల్లయ్య మాట్లాడుతూ తెలంగాణ సాంస్కృతి సాంప్రదాయాలను కొనసాగిస్తూ భావితరాలకు కూడా కొనసాగింపుగా అందించాలన్న లక్ష్యంతో ఈ బతుకమ్మ వేడుకలు నిర్వహించడం జరిగిందని అందుకు సహకరించిన రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు విరహత్ అలీ, రామ్ నారాయణ, కార్యదర్శి మధుగౌడ్, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు విజయ్ కుమార్, సురేష్ కుమార్ లకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా 18 గ్రూపులుగా విద్యార్థులు బతుకమ్మలను ఏర్పాటు చేసి కళాశాల ప్రాంగణంలో ఆడి పాడారు. వారికి ప్రథమ, ద్వితీయ, తృతీయ నగదు బహుమతులతో పాటు మరో 16 ప్రోత్సహక బహుమతులు కూడా అందజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ మదన్ మోహన్, సీనియర్ జర్నలిస్టు కొండకింది మాధవరెడ్డి, కందికొండ మోహన్, పట్టణ కార్యదర్శి శ్రీశైలం, కోశాధికారి రమణ కుమార్, కొల్లాపూర్ నియోజకవర్గం అధ్యక్షుడు మాలే. రాజేందర్ గౌడ్, నాయకులు తిరుపతయ్య, బూషపాగ శ్రీను, పవన్ అధ్యాపకులు ఉమాదేవి, వనిత, రమ్య, శోభారాణి, అంజయ్య, కోదండ రాములు, రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.