20-09-2025 07:53:25 PM
కరీంనగర్,(విజయక్రాంతి): బధిర విద్యార్థుల్లో మంచి ప్రతిభ ఉందని, వారికి చేయూతనిస్తూ మరిన్ని నైపుణ్యాల్లో శిక్షణ ఇవ్వాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. కరీంనగర్ జిల్లా యంత్రాంగం, అక్షయ ఆకృతి ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఇండియన్ సైన్ లాంగ్వేజిపై ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ఆసక్తి గల ఇతర వర్గాల వారికి రెండవ దశ శిక్షణ కార్యక్రమం ముగిసింది. కోర్స్ పూర్తి చేసుకున్న వారికి మున్సిపల్ కార్యాలయ సమావేశ మందిరంలో శనివారం సర్టిఫికెట్ల ప్రదానం చేశారు. ముఖ్యఅతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ... బధిర విద్యార్థుల్లో ఇప్పటికే చేతి కళల్లో గొప్ప ప్రతిభ ఉందని అన్నారు. వారికీ ఆర్ట్ క్రాఫ్ట్, బుక్ బైండింగ్, ఫోటో పెయింట్ వంటి వివిధ రంగాల్లో శిక్షణ ఇస్తే భవిష్యత్తులో రాణించగలరని తెలిపారు. ఇందుకోసం ప్రణాళిక సిద్ధం చేయాలని అన్నారు.