25-09-2025 12:00:00 AM
కంఠేశ్వర్ ప్రాంతంలో అర్ధరాత్రి పట్టుకున్న పోలీసులు
నిజామాబాద్, సెప్టెంబర్ 24 (విజయక్రాంతి): మహారాష్ట్రలోని నాందేడ్ నుంచి నిజామాబాద్ మీదుగా ఆర్మూర్‌కు అక్రమంగా తరలిస్తున్న రూ.కోటి విలువ చేసే బం గారాన్ని మంగళవారం అర్ధరాత్రి నిజామాబాద్ జిల్లా కంఠేశ్వర్ ప్రాంతంలో పోలీసు లు పట్టుకున్నారు. మంగళవారం అర్ధరాత్రి తర్వాత నిజామాబాద్ పోలీసులకు అక్రమంగా బంగారం తరలిస్తున్నట్లు సమాచారం అందింది.
ఈ మేరకు ప్రధాన మార్గాల్లో వాహనాల తనిఖీలు చేపట్టారు. కంఠేశ్వర్ ప్రాంతంలో తనిఖీలు నిర్వహిస్తుండగా ఓ కారులో అక్రమంగా తరలిస్తున్న కిలో బంగారం పట్టుబడింది. ఈ బంగారాన్ని మహారాష్ట్రలోని నాందేడ్ నుంచి నిజామాబాద్ మీదుగా ఆర్మూర్‌కు తరలిస్తున్నట్లు తెలి సింది. కారులో ఉన్న ఆర్మూర్‌కు చెందిన ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని, మూడో టౌన్‌కు తరలించారు.