calender_icon.png 20 September, 2025 | 10:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గెంటేశారు... ఇంటి ముందే పిల్లలతో భార్య ధర్నా

20-09-2025 08:27:45 PM

తుంగతుర్తి,(విజయక్రాంతి): కొడుకు పుట్టలేదనే సాకుతో భార్య, ఇద్దరు కూతుళ్లను ఇంట్లోంచి తరిమేసిన ప్రబుద్దుడి నిర్వాకం తుంగతుర్తి మండల కేంద్రంలో ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాల ప్రకారం.. తుంగతుర్తి మండల పరిధిలోని కొత్తగూడెం గ్రామానికి చెందిన పేర్ల కుశలవ సుజాత దంపతుల కూతురు అనురాధ కు తుంగతుర్తి మండల కేంద్రానికి చెందిన మట్టపల్లి నరసయ్య వెంకటమ్మ దంపతుల కుమారుడు మధు తో 2012 లో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు ఆడపిల్లలు పుట్టే వరకు కాపురం సజావుగానే సాగింది. అప్పటి నుండి అత్తింటి వారి వేధింపులు మొదలయ్యాయి.

ఆడపిల్లలు పుట్టారనే నెపంతో అత్తింటి వారు తమ కొడుకును విడిచి వెళ్లి పోవాలని మానసికంగా శారీరకంగా, హింసించ సాగినట్లు ఆమె ఆరోపించింది. పెద్దమనుషులు పరిష్కరిస్తారని సంవత్సరాలు గడుస్తున్న, భర్తకు దూరమై, పిల్లలు తండ్రికి దూరమై కష్టాలు పడుతున్నారు. అలాంటి పరిస్థితిపై తన పుట్టింటికి వెళ్ళిన అనురాధ, తన బిడ్డల భవిష్యత్తు కోసం మనసును మార్చుకొని శుక్రవారం తన అత్తగారింటికి ఇద్దరు బిడ్డలతో కలిసి రాగా మధు.. అతని తల్లిదండ్రులు ఇంట్లోకి రానివ్వకపోవడంతో ఇంటి ఆరుబయట రాత్రి తన ఇద్దరు బిడ్డలతో కలిసి, ఇంటి ముందు చెట్టు నీడలో బిక్కుబిక్కుమంటూ తిండి లేక కూర్చుంది.

ఈ సంఘటన స్థానిక పోలీసులు తెలుసుకొని, ఓ కానిస్టేబుల్ వచ్చి చూచి, కనీసం మానవత్వం చూపకుండా ప్రదర్శించారు. శుక్రవారం రాత్రి పరిశీలనకు వచ్చిన పోలీసు అధికారి ఎవరు, ఈ విధంగా ఎందుకు జరిగిందో, కనీసం ఆమె మామ కుటుంబాన్ని మందలించకపోవడమేంటిదని మహిళలు ప్రశ్నిస్తున్నారు. జరిగిన సంఘటనపై జిల్లా ఎస్పీ విచారణ జరిపి, మహిళల పట్ల న్యాయం చేయాల్సిన పోలీసులు ఈ విధంగా చేయడం సమాజానికి సిగ్గుచేటు. నిర్లక్ష్యం వాయించిన పోలీసులపై శాఖా పరమైన చర్యలు తీసుకోవాలని స్థానిక మహిళా నాయకులు మహిళలు కోరుతున్నారు.