calender_icon.png 25 September, 2025 | 5:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వైద్య కళాశాలలో బతుకమ్మ వేడుకలు

25-09-2025 12:04:33 AM

కుమ్రం భీం ఆసిఫాబాద్, సెప్టెంబర్ 24 (విజయ క్రాంతి): జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలో బుధవారం బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రిన్సిపల్ డాక్టర్ శ్రీలక్ష్మి అధ్వర్యంలో మహిళా అధ్యాపకులు, విద్యార్థులతో కలిసి కళాశాల ఆవరణలో బతుకమ్మ ఆట పాటలతో సంబరాలను జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో డా.ప్రియదర్శిని, డా. విశాఖ, డా.శ్రీ లక్ష్మి పాల్గొన్నారు.

వసుంధర కళాశాలలో..

కాగజ్‌నగర్, సెప్టెంబర్ 24 (విజయక్రాం తి): కాగజ్‌నగర్ పట్టణంలోని వసుంధర జూనియర్, డిగ్రీ కళాశాలలో బుధవారం బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వసుంధర  జూని యర్ , డిగ్రీ  కళాశాలల యాజమాన్యం ప్రతినిధి కుడిక్యాల జమున రాజమౌళి, కళాశాల ల ప్రిన్సిపాల్స్, అధ్యాపకలు పాల్గొన్నారు.