25-09-2025 12:05:36 AM
- అమ్మవారి సంపూర్ణ దేశ మహిళలంతా విద్యావంతులు కావాలి
- జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
గజ్వేల్, సెప్టెంబర్ 24 : వర్గల్ శ్రీ విద్యాధరి క్షేత్ర మహత్యం గొప్పదని, శరన్నవరాత్రులలో అమ్మవారిని దర్శించుకోవాలనే సంకల్పం నెరవేరిందని జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. బుధవారం సిద్దిపేట జిల్లా వర్గల్ మండల కేంద్రంలోని శ్రీ విద్యా సరస్వతి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ వ్యవస్థాపక చైర్మన్ బ్రహ్మశ్రీ యాయవరం చంద్రశేఖర శర్మ సిద్ధాంతి నేతృత్వంలో పేద పండితులు కవితను శేష వస్త్రంతో ఘనంగా సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొనడం పూర్వజన్మ సుకృతమన్నారు, కంచి స్వామి ఆశీస్సులు కంచి పీఠం ఆధ్వర్యంలో క్షేత్రాన్ని చక్కగా నిర్వహిస్తున్నారని కొనియాడారు . దేశంలోనే ఉన్నత పుణ్యక్షేత్రంగా ఎదగాలని ఆమె అన్నారు. అమ్మవారి సంపూర్ణ ఆశీస్సులతో దేశంలోని బాలికలు, మహిళలంతా విద్యావంతులుగా ఎదగాలని ఆకాంక్షించారు. కాగా మొదటగా ఆమెను క్షేత్ర నిర్వాహకులు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. లీగల్ సెల్ నేత, జాగృతి రాష్ట్ర నాయకులు కొట్టాల యాదగిరి ముదిరాజ్ తదితరులు ఆమె వెంట ఉన్నారు.