01-09-2025 06:50:32 PM
చిన్న వయసులోనే సేవ చేయటం మా అదృష్టం అంటున్న తల్లిదండ్రులు
వెల్దుర్తి (విజయక్రాంతి): వెల్దుర్తి మండల కేంద్రంలో సిద్ధివినాయక యూత్ సభ్యులు నిలిపిన వినాయక మండపంలో బడి ఈడు పిల్లలంతా కలిసి ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో గ్రామస్తులు అలాగే సిద్ధి వినాయక యూత్ కమిటీ సభ్యులు పాల్గొని ఇట్టి కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా పూర్తి చేశారు. ఆ తరువాత అక్కడికి వచ్చిన గ్రామస్తులు అలాగే కమిటీ సభ్యులు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన పిల్లలందరినీ అభినందనల వెల్లువలు కురిపించారు. ఇంత చిన్న వయసులోనే భక్తి భావం ఉండడం అలాగే చదువుతో పాటు, అందరికీ అన్న ప్రసాదం అందించాలని సంకల్పంతో ఈ కార్యక్రమం చేయడం చాలా సంతోషమని కమిటీ సభ్యులు గ్రామస్తులు పిల్లలను అభినందించారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు వెన్నవరం శ్రీధర్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, మైపాల్ రెడ్డి, నరేందర్ రెడ్డి, మల్లేశం చారి, విక్రమ్ సింగ్, ప్రకాష్, కోటేశ్వరరావు, శేఖర్, నారాయణ, తదితరులు పాల్గొన్నారు.