calender_icon.png 4 September, 2025 | 2:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజావాణి సమస్యలు పరిష్కరించాలి: కలెక్టర్ రాహుల్ శర్మ

01-09-2025 06:01:08 PM

రేగొండ/భూపాలపల్లి,(విజయక్రాంతి): ప్రజావాణి కార్యక్రమంలో ప్రజలు సమర్పించిన దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణిలో సోమవారం 70 దరఖాస్తులు వచ్చాయని వచ్చిన ప్రతి దరఖాస్తును నిర్లక్ష్యం చేయకుండా సంబంధిత శాఖ అధికారులు జాగ్రత్తగా పరిశీలించి చర్యలు తీసుకోవాలని సూచించారు.

ప్రజావాణి కార్యక్రమం ద్వారా ప్రజలు నేరుగా తమ సమస్యలను దరఖాస్తుల ద్వారా పరిష్కరించుకోవచ్చని కలెక్టర్ రాహుల్ శర్మ పేర్కొన్నారు.ప్రజలు చేసిన వినతులను కేవలం నమోదు చేయడం కాకుండా శాశ్వత పరిష్కారానికి అధికారులు కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.