calender_icon.png 25 September, 2025 | 4:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టీఎన్జీవోస్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబురాలు

25-09-2025 12:30:58 AM

హైదరాబాద్ సిటీ బ్యూరో, సెప్టెంబర్ 24 (విజయక్రాంతి): తెలంగాణ నాన్-గెజిటెడ్ ఆఫీసర్స్ యూనియన్, హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు విక్రమ్ కుమార్, కార్యదర్శి కుర్రా డి శ్రీనివాస్ పర్యవేక్షణలో బుధవారం బతుకమ్మ సంబురాలు వైభవంగా జరిగాయి. ఈ వేడుకల్లో ప్రభుత్వ శాఖలకు చెందిన వందలాది మంది మహిళా ఉద్యోగులు సంప్రదా య దుస్తుల్లో పాల్గొని, బతుకమ్మ ఆడుతూ సందడి చేశారు.

మారమ్ జగదీశ్వర్ (అధ్యక్షుడు, టీఎన్జీవోస్ సెంట్రల్ యూనియన్), డా. ఎస్. ఎం. హుస్త్స్రనీ (ముజీబ్) (ప్రధాన కార్యదర్శి, టీఎన్జీవోస్ సెంట్రల్ యూనియన్), నిర్మలాజగ్గారెడ్డి(చైర్‌పర్సన్, టీజీఐఐ సీ), కల్వ సుజాత గుప్తా (చైర్‌పర్సన్, టీజీ ఆర్యవైశ్య కార్పొరేషన్), శిల్పావల్లి, ఐపీఎస్ (డీసీపీ, సెంట్రల్ జోన్), విజయరెడ్డి (కార్పొరేటర్, ఖైరతాబాద్) ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.

టీఎన్జీవోస్ సెంట్రల్ యూనియన్ అసోసియేట్ ప్రెసిడెంట్ కస్తూరి వెం కటేష్, ట్రెజరర్ ఎం. సత్యనారాయణ, సిటీ యూనియన్ అధ్యక్షులు కె. శ్రీకాంత్, కార్యదర్శి హరి కృష్ణ, జిల్లా అసోసియేట్ ప్రెసిడెం ట్ కె.ఆర్. రాజ్ కుమార్, జాయింట్ సెక్రటరీ గీత పాల్గొన్నారు. అలాగే కార్యవర్గ సభ్యులు ఖాలెద్ అహ్మద్, శ్రీ వైదిక్ శేస్త్ర, శ్రీ ముఖీమ్ ఖురేషీ, శ్రీ శ్రీధర్, సెంట్రల్ యూనియన్ కార్యవర్గ సభ్యులు శ్రీమతి ఉమ, శ్రీమతి శైలజ, శ్రీమతి గీత, సుజాత, శ్రీనివాస్ గౌడ్, శ్రీనివాస్ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.