calender_icon.png 25 September, 2025 | 3:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా జిల్లాస్థాయి బతుకమ్మ సంబురాలు

25-09-2025 12:30:11 AM

పాల్గొన్న మంత్రి సీతక్క

కరీంనగర్, సెప్టెంబరు 24 (విజయక్రాంతి): జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో జిల్లా స్థాయి బతుకమ్మ సంబురాలు నగరంలోని మహాత్మా జ్యోతిబా మైదానంలో బుధవారం రాత్రి ఘ నంగా జరిగాయి. ఈ సంబరాలకు మహిళాభివృద్ధి, శిశు సంక్షేమం, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క, రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హా జరయ్యారు. మంత్రి సీతక్క మహిళలతో కలిసి బతుకమ్మ ఆడి ఉత్సాహపరిచారు.

ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ బతుకమ్మ పండుగ వందల ఏళ్ల నాటి ఆచార, సాంప్ర దాయమని, ఈ పండగ మరో వెయ్యేండ్లు వర్ధిల్లాలని ఆకాంక్షించారు. మహిళలంతా ఐక్యంగా, సంతోషంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా కమిషన్ రాష్ట్ర చైర్పర్సన్ నేరెళ్ల శారద, తెలంగాణ ఉమెన్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్పర్సన్ బండ్రు శోభారాణి, జిల్లా క లెక్టర్ పమేలా సత్పతి, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ సత్తు మల్లేశం, పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం, అడిషనల్ కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే, లక్ష్మీ కిరణ్, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, డిఆర్‌ఓ వెంకటేశ్వర్లు, ఆర్డీవోలు మహేశ్వర్, రమేష్ బాబు, తదితరులుపాల్గొన్నారు.