20-09-2025 08:03:34 PM
శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి
నల్లగొండ టౌన్ (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర అడబిడ్డలందరికి తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి(Legislative Council Chairman Gutha Sukender Reddy) ఎంగిలి పూల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ సాంస్కృతిక వారసత్వానికి ప్రతీక అని ఆయన అన్నారు. ప్రకృతినే దైవంగా పూజించే గొప్ప పండుగ బతుకమ్మ పండుగ అని ఆయన చెప్పారు. ఈ తొమ్మిది రోజుల పాటు బతుకమ్మ పండుగను ఆటపాటలతో, ఆనందోత్సాహాల నడుమ జరుపుకోవాలని, ప్రజల జీవితాల్లో బతుకమ్మ పండుగ వెలుగులు నింపాలని తెలిపారు.