calender_icon.png 20 September, 2025 | 10:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శృంగేరి పీఠాధిపతులను ఆహ్వానించిన ప్రభుత్వ విప్

20-09-2025 08:02:09 PM

రాజన్న సిరిసిల్ల,(విజయక్రాంతి): దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి రావాల్సిందిగా శృంగేరి జగద్గురు శ్రీశ్రీశ్రీ భారతి తీర్థ మహాస్వామి, శృంగేరి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ విధుశేఖర భారతి స్వామివారులను వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, ఆలయ ఈఓ రమాదేవి కోరారు. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో జరుగుతున్న పనుల తీరుతెన్నులు, ప్రగతి వివరాలను స్వామి వారికి వివరించి, స్వామి వారికి ఆహ్వాన పత్రిక అందజేశారు.

ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి విస్తరణ పనుల పురోగతిపై స్వామి వారికి వివరించారు. ఆహ్వానాన్ని మన్నించి వచ్చే మాసంలో వస్తానని తెలిపారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, రాజన్న ఆలయ బృందం శృంగేరి లోని శ్రీ శారద అమ్మవారిని దర్శించుకొని తుంగభద్ర నదిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారి వెంట రాజన్న ఆలయ ఈవో రమాదేవి, ఆలయ ఇంచార్జి స్థానాచారి నమిలికొండ ఉమేష్ శర్మ, చంద్రగిరి శరత్, శృంగేరి తెలంగాణ రాష్ట్ర బాధ్యులు రాధాకృష్ణ శర్మ ఉన్నారు.