calender_icon.png 20 September, 2025 | 10:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను విద్యార్థులు భవిష్యత్ తరాలకు అందించాలి

20-09-2025 08:05:21 PM

చిట్యాల (విజయక్రాంతి): తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను విద్యార్థులు భవిష్యత్తు తరాలకు అందించాలని గ్రీన్ గ్రోవ్ పాఠశాల డైరెక్టర్ జూలకంటి వేణుగోపాల్ రెడ్డి శనివారం అన్నారు. తెలంగాణ రాష్ట్ర పండుగ బతుకమ్మను చిట్యాల మున్సిపాలిటీ పరిధిలో ఉన్న గ్రీన్ గ్రోవ్ పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ పూల జాతరలో విద్యార్థినులు వివిధ రకాల తెలంగాణ సాంప్రదాయ దుస్తులతో అలరించారు. ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ జూలకంటి వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రాంతంలో మాత్రమే ప్రకృతిని పూజించే పండుగ బతుకమ్మ పండుగ అని, తెలంగాణ ప్రాంతంలోని లభించే పూలను తీసుకువచ్చి 9 రోజుల పాటు ఘనంగా ఆడపడుచులు బతుకమ్మ ఆటను ఆడుతారని అన్నారు. ఈ పూల జాతరను సంస్కృతి  చోళ రాజు బట్టు నరసింహ కాలం నుండి ఈ సాంప్రదాయం కొనసాగుతుందని, అంతేకాకుండా తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను విద్యార్థులు భవిష్యత్తు తరాలకు అందించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఏవో పోల గోవర్ధన్, ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు.