calender_icon.png 20 September, 2025 | 10:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బతుకమ్మ పండుగ తెలంగాణ ఆత్మను ప్రతిబింబిస్తుంది

20-09-2025 08:48:44 PM

పాపన్నపేట (విజయక్రాంతి): బతుకమ్మ పండుగ తెలంగాణ ఆత్మను ప్రతిబింబిస్తుందని పాపన్నపేట ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు మహేశ్వర్ పేర్కొన్నారు. మండలంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో శనివారం బతుకమ్మ సంబరాలు మిన్నంటాయి. విద్యార్థులు చదువుతో పాటు సంస్కృతి, సాంప్రదాయాలను అలవర్చుకోవాలని వారు సూచించారు. విద్యార్థులు సంప్రదాయ దుస్తులతో పాఠశాలలకు హాజరు కావడంతో పూర్తిగా పండగ వాతావరణం నెలకొంది. రంగురంగుల పూలతో విద్యార్థులు, అధ్యాపకులు కలిసి బతుకమ్మలను పేర్చి ఆడి పాడారు. అనంతరం స్థానిక చెరువుల్లో నిమజ్జనం చేసి సందడిగా గడిపారు.