20-09-2025 08:51:16 PM
లక్షేట్టిపేట,(విజయక్రాంతి): ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా నిలిచేది జర్నలిస్టు లు అని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శనివారం పట్టణంలోని స్థానిక ప్రెస్ క్లబ్ ద్వితీయ వార్షికోత్సవ వేడుకకు కలెక్టర్ ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.... నిజాలను తెలుసుకుని ప్రజలకు జవాబుదారీగా మీడియా వ్యవహరించాలని సూచించారు. ఒకప్పటి మీడియాకు ఇప్పటి మీడియాలో ఎన్నో మార్పులు జరిగాయని పలు ఉదాహరణలతో వివరించారు.
ముఖ్యంగా తొందరపాటుతో తప్పడు సమాచారం వలన సమాజాన్ని పక్క దారి పట్టించిన వారు కావద్దని హితవు పలికారు. భారత రాజ్యాంగం ఫోర్త్ ఎస్టేట్ కు ఎంతో ప్రాధాన్యత కల్పించిందన్నారు. జిల్లాలో కొందరు జర్నలిస్ట్ లు మీడియా ద్వారా బయట ప్రపంచానికి చూపుతున్న కథనాలపై స్పందిస్తున్నామని వెల్లడించారు. ప్రజలను ఎప్పటికప్పుడు మీడియా అప్రమత్తం చేయాలని కోరారు. అంతకుముందు పలువురు నాయకులు మాట్లాడుతూ లక్షేట్టిపేటలో ప్రెస్ క్లబ్ భవన్ అనేది ఎన్నో కష్టాలు ఎదుర్కొని జర్నలిస్ట్ లు సాధించారని కొనియాడారు.
జర్నలిస్ట్ లకు ఎప్పుడు పార్టీ లకు అతీతంగా అండగా ఉంటామన్నారు. మీడియాకు సమాజంలో ప్రధాన పాత్ర ఉందని గుర్తు చేశారు.జర్నలిస్ట్ లు బాధ్యత యుతంగా పని చేయాలని సూచించారు. అనంతరం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ ను ఘనంగా శాలువాతో సన్మానించారు. ప్రెస్ క్లబ్ అధ్యక్షులు బోనగిరి కుమార్ ఆధ్వర్యంలో ప్రెస్ క్లబ్ చుట్టూ ప్రహరీ గోడ నిర్మాణానికి నిధులు మంజూరు చేసి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.