20-09-2025 08:47:57 PM
ఆదిలాబాద్,(విజయక్రాంతి): విద్యార్థి దశ ఎంతో విలువైనదని, ఈ సమయాన్ని వృధా చేయకుండా సరైన రీతిలో వినియోగించుకుంటే జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగవచ్చని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ సూచించారు. శనివారం ఆదిలాబాద్ లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల-1లో పీఎం శ్రీ పథకం కింద 2 అదనపు తరగతుల భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... విద్యారంగం అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. ప్రభుత్వ విద్యను బలోపేతం చేస్తూనే విద్యార్థులకు అన్ని సౌకర్యాలను కల్పించాలని ప్రభుత్వం కు విన్నవించారు.
విద్య వ్యవస్థలు చాలా మార్పులు రావాల్సి ఉందని పేర్కొన్నారు. గతంలో కేవలం 35 మార్కులు వచ్చి పాస్ అయితే సరిపోయేదని, కానీ ప్రస్తుతం కాంపిటీషన్ సమాజంలో ఉత్తమ ర్యాంక్ లు వస్తేనే విద్యార్థికి భవిష్యత్తు ఉంటుందన్నారు. ప్రాథమిక, ఉన్నత విద్య లో సరైన ప్రామాణికతను అందించాలని, అప్పుడే ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం అవుతాయన్నారు. భారతదేశంలోని పురాతన విద్యా వ్యవస్థ పై వివిధ దేశాలు అధ్యయనం చేస్తున్నాయని, అందుకు చదువుల తల్లి సరస్వతీ దేవిని ఫోటోలు పెట్టి పూజించడమే దీనికి న్8దర్శనం అని అన్నారు.