calender_icon.png 20 September, 2025 | 10:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండుగ

20-09-2025 08:55:01 PM

నూతనకల్,(విజయక్రాంతి): తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండుగ అని మండల కేంద్రంలోని నాగార్జున ఉన్నత పాఠశాల కరస్పాండెంట్ మారగాని వెంకట్ గౌడ్ అన్నారు.శనివారం పాఠశాలలో ముందస్తు బతుకమ్మ పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రంగురంగుల పువ్వులను కోసుకొచ్చి విద్యార్థిని విద్యార్థులచే బతుకమ్మలను పేర్చి గౌరీమాతను నెలకొల్పి బతుకమ్మ సంబరాలను నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని కరస్పాండెంట్ మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల పట్ల విద్యార్థులకు అవగాహన కల్పించడంతో పాటు భక్తి భావాన్ని పెంపొందించడం కోసమే ఇలాంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు.