calender_icon.png 20 September, 2025 | 10:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాం నగర్ లో ఎమ్మెల్యే పర్యటన

20-09-2025 08:58:49 PM

హన్మకొండ,(విజయక్రాంతి): వరంగల్ పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని 52 వ డివిజన్ రాం నగర్ లో  శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి, నగర మేయర్ గుండు సుధారాణి, నగర కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ తో కలిసి పర్యటించారు.పోలిస్ పరేడ్ గ్రౌండ్ పక్క నుంచి చాలా కాలనీలకు అనుసంధానంగా ఉండే రోడ్డు కొరకు నిర్మాణం, సైడ్ డ్రైనేజీ, వేడెల్పు కార్యక్రమంపై క్షేత్ర స్థాయిలో కాలనీలో పర్యటిస్తూ పరిశీలించారు. అనంతరం  చారిత్రాత్మక వేయి స్తంభాల దేవాలయ ఆవరణలో జరుగుతున్న ఎంగిలి పూల బతుకమ్మ ఏర్పాట్లను పరిశీలించారు.రేపు పెద్ద ఎత్తున మహిళలు బతుకమ్మ ఆడటానికి వస్తారని ఏర్పాట్లకు ఎటువంటి ఆటంకాలు లేకుండా చూడాలని సూచించారు.