calender_icon.png 25 September, 2025 | 5:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ

25-09-2025 01:15:42 AM

  1. బీసీ రిజర్వేషన్ల సాధనకు ఐక్యంగా ముందుకు సాగాలి 

మాజీ గవర్నర్  బండారు దత్తాత్రేయ 

ఖైరతాబాద్; సెప్టెంబర్ 24 (విజయ క్రాంతి) : తెలంగాణ సాంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండుగ అని హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. బుధవారం బీసీ మహిళా సంక్షేమ సంఘం అధ్యక్షురాలు మణి మంజరి ఆధ్వర్యంలో బీసీ రిజర్వేషన్ల సాధన కోసం సచివాలయం ముందు ఏర్పాటుచేసిన బిసి బతుకమ్మ సంబరాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు  జాజుల శ్రీనివాస్ గౌడ్‌తో కలిసి మాట్లాడారు.. తెలంగా ణలో బతుకమ్మ పండుగ ప్రత్యేకమైన స్థానం ఉంది అని అన్నారు.

ఆడపడుచులు కష్టలను మరిచిపోయి సుఖ సంతోషాలతో ఆనందంగా జరుపుకునే పండుగ బతుకమ్మ పండుగ అని అన్నారు. బీసీ రిజర్వేషన్ల సాధన కోసం బీసీలంతా ఐక్యంగా కావాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీసీ కమిషన్ మెంబర్లు బాలలక్ష్మి, శోభన బీసీ ఉద్యోగ సంఘం అధ్యక్షులు రమ, బీసీ కల్చరల్ ఫోరం అధ్యక్షులు వరంగల్ శీనన్న, బిసి సంక్షేమ సంఘం కార్యనిర్వహకులు కుల్కచర్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.