21-09-2025 12:51:14 AM
తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి
హైదరాబాద్, సెప్టెంబర్ 20 (విజయక్రాంతి) : తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలతో పాటు ఆడపచుడుల ఔన్నత్యానికి ప్రతీక.. బతుకమ్మ పండుగ. తెలంగాణ సాముహిక జీవన విధానానికి, కష్టసుఖాలను కలిసి పంచుకునే ప్రజల ఐకమత్యానికి ఈ పండుగ నిదర్శనం. ఎంగిలిపూల నుంచి సద్దుల వరకూ తొమ్మిది రోజులు బతుకమ్మ ఆట పాటలతో అందరూ వైభవంగా ఈ పండుగను జరుపుకోవాలి. రాష్ర్ట ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలని, అందరూ ఆనం దంగా ఆరోగ్యంగా ఉండాలని గౌరమ్మను ప్రార్థిస్తున్నా. తెలంగాణ ఆడపడుచులకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు.
ఆత్మగౌరవానికి నిలువెత్తు నిదర్శనం : మంత్రి సీతక్క
తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవానికి నిలువెత్తు నిదర్శనం.. బతుకమ్మ. మన తల్లులు, అక్కాచెల్లెళ్లు భక్తి శ్రద్ధలతో అలంకరించే బతుకమ్మలు కేవలం పూల సమాహారమే కాదు... అవి తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, సామూహిక జీవన సౌందర్యానికి సజీవ రూపం. బతుక మ్మ పూలతో ప్రకృతిని ఆరాధించడం, గౌరమ్మ ను సత్కరించడం, సోదరీమణులు కలసి పాడుతూ, ఆడుతూ జరుపుకోవడం తెలంగాణ సంస్కృతి ప్రత్యేకతను ప్రతిబింబిస్తాయి.
తెలంగాణ తల్లికి మరింత కీర్తిని చేకూర్చాలి : మంత్రి కొండా సురేఖ
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల ఔన్నత్యాన్ని బతుకమ్మ పండుగ విశ్వవ్యాప్తంగా చాటుతుంది. ఈ ఏడాది బతు కమ్మ.. తెలంగాణ తల్లికి మరింత కీర్తిని చేకూర్చాలి. చారిత్రక ప్రదేశాలు, ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు, వారసత్వ కట్టడాలు, పర్యాటక ప్రాంతాల్లో తొమ్మిది రోజుల పాటు బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.
తెలంగాణ అస్తిత్వ ఆకాంక్షల వేదిక బతుకమ్మ: మాజీ సీఎం కేసీఆర్
తెలంగాణ అస్తిత్వానికీ, సాంస్కృతిక జీవనా నికి బతుకమ్మ తరతరాల ప్రతీక. ఎంగిలి పూల తో ప్రారంభమై సద్దులతో ముగిసే తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ, పల్లెలు పట్టణాల్లో మహి ళలు, పిల్లా పాపలతో ప్రత్యేక సాంస్కృతిక సందడి నెలకొంటుంది. సబ్బండ వర్గాల భాగ స్వామ్యంతో, నాటి రాష్ర్ట సాధన ఉద్యమంలో, తెలంగాణ అస్తిత్వ ఆకాంక్షలకు బతుకమ్మ ప్రధా న సాంస్కృతిక వేదికగా నిలిచింది. నాటి బీఆర్ ఎస్ ప్రభుత్వం బతుకమ్మను రాష్ర్ట పండుగగా ప్రకటించి, మహిళలకు కాను కగా బతుకమ్మ చీరలు అందజేసింది. కష్టాల నుంచి రక్షించి రాష్ర్ట ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలని, ప్రకృతి మాత బతుకమ్మను ప్రార్థిస్తున్నా.
సంస్కృతి, సంప్రదాయాల్లోనే విశిష్టమైనది : డిప్యూటీ సీఎం భట్టి
ప్రకృతిని, పూలను దేవతగా కొలిచే బతుకమ్మ పండుగ ప్రపంచ సంస్కృతి, సంప్రదాయాల్లోనే విశిష్టమైనది. తెలంగాణ సంస్కృతికి చిహ్నం, అస్తిత్వానికి ప్రతిరూపం బతుకమ్మ. ఆటపాటల తో, ఆనందోత్సాహాల మధ్య తెలంగాణ ఆడబి డ్డలందరూ బతుకమ్మ పండుగ జరుపుకోవాలి. తెలంగాణ సామూహిక జీవనానికి, ఐకమత్యా నికి, సంఘటిత శక్తికి ప్రతీకైన బతుకమ్మ ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలి.
పల్లెకు కొత్త అందాన్ని తీసుకొచ్చే పండుగ : మంత్రి పొన్నం ప్రభాకర్
పల్లెకు కొత్త అందాన్ని తీసుకొచ్చేది.. బతు కమ్మ పండుగ. తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చి.. ఆడబిడ్డలంతా ఒక చోట చేరి ఆటపాట లతో ఆనందంగా జరుపుకునే తెలం గాణ సాంస్కృతిక ప్రతీక బతుకమ్మ. ఆనం దోత్సహాల మధ్య జరుపుకునే బతుకమ్మ పండుగ ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలి.