calender_icon.png 21 September, 2025 | 3:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాజకీయాల్లో తోవ ఉండదు.. తోసుకుంటూ పోవుడే

21-09-2025 12:35:20 AM

-నాతో టచ్‌లో ఉన్న బీఆర్‌ఎస్ లీడర్ల జాబితా పెద్దదే

-కాళేశ్వరం అంశంలో తప్ప హరీశ్‌పై వేరే కోపం లేదు

-తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత

హైదరాబాద్, సెప్టెంబర్ 20 (విజయక్రాంతి): రాజకీయాల్లో ఎవరూ తోవ ఇవ్వర ని, తోసుకుంటూ పోవాల్సిందేనని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. కాంగ్రెస్‌లోకి వెళ్లాలన్న ఆలోచన లేదని, ఆ పార్టీ పెద్దలెవరూ తనను సం ప్రదించలేదన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి ఎందుకలా అంటున్నారో తెలియదని, బహుశా భయపడుతున్నారేమో అని ఎద్దేవా చేశారు. కాళేశ్వరం అంశంలో తప్ప హరీశ్‌రావుపై తనకు వేరే కోపం లేదని, నీటి పారుదల శాఖలో హరీశ్‌రావు వ్యవహారంపై 2016 లోనే కేటీఆర్‌ను అలెర్ట్ చేశానన్నారు.

కిందిస్థాయి కమిటీ పరిశీలన లేకుండానే సీఎంకు ఫైళ్లు వెళ్లాయని, జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక చూస్తే అన్ని అర్థమవుతాయని స్ప ష్టం చేశారు. రాజకీయ పార్టీ ఏర్పాటుపై ఇం కా ఆలోచించలేదని, కొత్త పార్టీ పెట్టే ముం దు గతంలో కేసీఆర్ వందల మందితో చర్చ లు జరిపారని.. ప్రస్తుతం తాను అదే పని చేస్తున్నానని తెలిపారు. శనివారం బంజారాహిల్స్‌లోని జాగృతి కార్యాల యంలో కవిత మీడియాతో మాట్లాడుతూ.. కర్ణాటక ప్రభు త్వం ఆల్మట్టి డ్యాం ఎత్తు ను 519 అడుగుల నుంచి 524 అడుగులకు పెంచేందుకు కుట్ర లు చేస్తోందని, వాటిని ప్రభుత్వం అడ్డుకోవాలన్నారు.

ఈ వారంలో కృష్ణా ట్రైబ్యూనల్ హియరింగ్‌కు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు సీఎం రేవంత్ రెడ్డి హాజరై ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంచడం వల్ల రాష్ట్రానికి జరుగుతోన్న నష్టాన్ని ట్రిబ్యునల్‌కు వివరించాలని డిమాండ్ చేశారు. పాలమూరు పులిబిడ్డను అని చెప్పుకుని రేవంత్ రెడ్డి కూడా పాలమూరు -రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేసేందుకు ఒక్క పైసా నిధులు మంజూరు చేయడం లేదని ఆరోపించారు.

గ్రూప్ అంశంపై సీఎం రేవంత్ రెడ్డి హైకోర్టు డివిజన్ బెంచ్‌తో పాటు సుప్రీం కోర్టుకు వెళ్తూ నిరుద్యోగుల జీవితాలతో చలగాటమాడుతున్నారని, తద్వారా వేరే నోటిఫికేషన్లు ఆలస్యమవుతున్నాయన్నారు. రాష్ర్టంలో బీసీ రిజర్వేషన్ల బిల్లు గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉందని.. ఆ విషయంపై ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్లాలని చెప్పినా పట్టించేకోవడం లేదన్నారు.  తనతో టచ్‌లో ఉన్న బీఆర్‌ఎస్ నేతల లిస్ట్ కూడా చాలా పెద్దదేనని అన్నారు.   చింతమడకలో బతుకమ్మ వేడుకలకు వెళ్లడం వెనుక రాజకీయమేమీ లేదని చెప్పారు.