28-09-2025 10:14:19 PM
నిజాంసాగర్ (విజయక్రాంతి): ఉమ్మడి నిజాంసాగర్ మండలంలోని మహమ్మద్ నగర్ మండల కేంద్రంలో అంగరంగ వైభవంగా కొనసాగుతున్న నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం ఉమ్మడి జిల్లా మాజీ జెడ్పీ చైర్మన్ దఫెదర్ రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని కోరారు. అనంతరం వేద పండితులు సంజీవరావు దుర్గామాత నిర్వాహకుల తరఫున ఘనంగా సన్మానించారు. ఆయన వెంట మమ్మద్ నగర్ మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సత్యనారాయణ మాజీ సిడిసి చైర్మన్ గంగారెడ్డి, గున్కుల్ సొసైటీ చైర్మన్ వాజిద్ అలీ, లక్ష్మీనారాయణ, లక్ష్మారెడ్డి సంగమేశ్వర్ గౌడ్, చందర్, అర్జన్, అఫ్జల్, కృష్ణారెడ్డి, సాయిబాబా, సిద్ధా గౌడ్, మహేందర్ తదితరులు ఉన్నారు.