calender_icon.png 18 October, 2025 | 2:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సిపిఆర్ పై అవగాహన కలిగి ఉండాలి

18-10-2025 12:20:55 PM

ప్రభుత్వ వైద్యశాల సూపర్డెంట్ ప్రవీణ్ 

కుమ్రం భీం ఆసిఫాబాద్(విజయక్రాంతి): సిపిఆర్ చేయడంపై ప్రతి ఒక్కరికి అవగాహన కలిగి ఉండాలని ప్రభుత్వాసుపత్రి సూపర్డెంట్ డాక్టర్(Government Hospital Superintendent Doctor) ప్రవీణ్ తెలిపారు.జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలలో శనివారం సిపిఆర్ పై డాక్టర్ కిరణ్ అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సూపర్డెంట్ మాట్లాడుతూ గుండె నొప్పిగా ఉన్నప్పుడు మొదటిగా సిపిఆర్ చేయాలని తద్వారా గుండెపోటు నివారణ కు ప్రథమ చికిత్స అందించిన వాళ్లు అవుతారని తెలిపారు. సిపిఆర్ పై వైద్య సిబ్బందితో పాటు ప్రజలు కూడా పూర్తిస్థాయిలో అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. గుండె నొప్పితో సమీపంలో ఎవరైనా బాధపడితే మొదటగా సిపిఆర్ చేయాలని సూచించారు. సిపిఆర్ పై విస్తృతంగా ప్రచారం చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు కృష్ణ ,తిరుమలేష్ సిబ్బంది పాల్గొన్నారు.