18-10-2025 02:15:00 PM
వలిగొండ, (విజయక్రాంతి): బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం అఖిలపక్షం పార్టీల ఆధ్వర్యంలో చేపట్టిన బంద్ ఫర్ జస్టిస్ వలిగొండలో విజయవంతమైంది కాంగ్రెస్, సిపిఎం, సిపిఐ, బీసీ సంఘాలు ఒకటిగా బిజెపి, బీఆర్ఎస్ వేరువేరుగా బంద్ ను నిర్వహించారు. ఉదయం నుండి వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు, బీసీ సంఘాల నాయకులు వ్యాపార సముదాయాలను విద్యా సంస్థలను మూసివేయాలని కోరగా వ్యాపారులు స్వచ్ఛందంగా తమ దుకాణాలు మూసివేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్, సిపిఎం, సిపిఐ, బిజెపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.