calender_icon.png 17 October, 2025 | 2:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 'ఎకో బజార్'

16-10-2025 11:15:21 PM

సిద్దిపేట క్రైం: సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాతీయ సేవా పథకం యూనిట్లు 1 నుంచి 7 వరకు, ఎకో క్లబ్ ఆధ్వర్యంలో “ఎకో బజారు - ప్రకృతి సంస్కృతి” అనే అంశంపై గురువారం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 41 స్టాల్స్ ప్రదర్శించారు. పోస్టర్ ప్రజెంటేషన్, క్విజ్ పోటీలు, వ్యాసరచన పోటీలు, పర్యావరణ అంశాలపై మోడల్ ప్రదర్శనలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జయ సునీత, ప్రధాన అతిథిగా హాజరై మాట్లాడుతూ, పర్యావరణ పరిరక్షణ మనందరి నైతిక బాధ్యత అన్నారు. విద్యార్థులు ఎకో ఫ్రెండ్లీ ఆలోచనలను అవలంబించి, కుటుంబం, గ్రామం, సమాజం వరకు పర్యావరణ చైతన్యాన్ని విస్తరించాలని ఆకాంక్షించారు. వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ అయోధ్య రెడ్డి, ఐపీఎస్సీ కోఆర్డినేటర్ డాక్టర్ సీహెచ్ మధుసూదన్, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ గోపాల సుదర్శన్ విద్యార్థులను అభినందించారు.