16-10-2025 11:23:52 PM
దీపావళికి వనపర్తి జనరల్ ఆసుపత్రి కార్మికులు పస్తులు ఉండకుండా వేతనం చెల్లించాలి..
తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్(ఏఐటీయూసీ) రాష్ట్ర కార్యదర్శి పి.సురేష్..
వనపర్తి (విజయక్రాంతి): వనపర్తి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి పారిశుద్ధ సెక్యూరిటీ పేషెంట్ కేర్ సూపర్వైజర్ కార్మికుల వేతన చెల్లింపు విచారణ పేరుతో జాప్యం సరికాదని తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ)రాష్ట్ర కార్యదర్శి పి.సురేష్ అన్నారు. గురువారం తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్(ఏఐటీయూసీ) ఆధ్వర్యంలో పెండింగ్ వేతనం చెల్లించాలని కోరుతూ వనపర్తి జిల్లా కలెక్టర్ కార్యాలయ సిబ్బందికి వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ రంగారావు సమక్షంలో కార్మికుల పెండింగ్ వేతనం, కార్మికుల ఇతర ముఖ్యమైన సమస్యలపై ఏజెన్సీ నిర్వాహకులు శ్రీకాంత్ రెడ్డి, ఏఐటీయూసీ మెడికల్ కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి పి.సురేష్, కార్మికులతో కలిసి చర్చలు జరిపారు.దీపావళికి కార్మికుల ఇబ్బందులు పడకుండా వేతనాల చెల్లించే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
కార్మికుల సమావేశంలో పి.సురేష్ మాట్లాడుతూ.. ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి 500 పైగా పడకల సామర్థ్యానికి కేవలం 330 పడకలకు మాత్రమే 143 కాంట్రాక్ట్ కార్మికుల సేవలందిస్తూ అదనపు పని భారానికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.విచారణ జరిగిన ప్రతిసారి కార్మికుల వేతనాల చెల్లింపుల్లో తీవ్రమైన జాప్యం జరుగుతుందని దీనితో కార్మికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. విచారణ పేరుతో దసరా పండుగకి కార్మికులకు వేతనాలు అందలేదని యూనియన్ నేతల కార్మికుల ఒత్తిడితో సూపరిండెంట్ డాక్టర్ రంగారావు ఆదేశాలతో ఏజెన్సీ నిర్వాహకులు కార్మికునికి 4000 రూపాయల అడ్వాన్సులు చెల్లించారని అన్నారు. ఇదే నెలలోనే దీపావళి పండుగ సమీపిస్తున్న జీతాల చెల్లింపులో క్లారిటీ లేదని అన్నారు. ఇప్పటికే అధికారులకు అనేకసార్లు విన్నవించడం జరిగిందని అన్నారు. దీపావళికైన కార్మికులకు ఇబ్బందులు పడకుండా తక్షణమే వేతనం అందించాలని లేనిచో మెరుపు సమ్మెకు దిగుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఆసుపత్రి బ్రాంచ్ నేతలు కార్మికులు గంధం శీను, నరసింహ, నరేందర్, మోహన్, పవన్,రాము, దర్గా స్వామి, కుమార్, రాజశేఖర్, జలాల్, షాబాద్,అనిల్, శివ, వెంకటయ్య,శ్రీకాంత్, లక్ష్మమ్మ, కళావతి, ఇందిరా,భాగ్యలక్ష్మి, గోవిందమ్మ,సుజాత తదితరులు పాల్గొన్నారు.