calender_icon.png 17 October, 2025 | 1:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కల్వరి చర్చి ప్రాంగణంలో ఘనంగా ముగిసిన ఉపవాస దీక్షలు

16-10-2025 11:28:18 PM

బెల్లంపల్లి (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలంలోని సోమ గూడెం గ్రామపంచాయతీ పరిధిలోగల కల్వరి చర్చి ఆవరణలో 50 రోజుల ఉపవాస దీక్షల ముగింపు కార్యక్రమం గురువారం ఘనంగా ముగిసింది. ఈ ఉపవాస దీక్షలకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, హర్యానా, చత్తీస్గడ్, కర్ణాటక, కేరళ, ఉత్తర ప్రదేశ్ తదితర ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున క్రైస్తవులు హాజరయ్యారు. ఈ దీక్షలో పాస్టర్ ప్రవీణ్ యేసు పవిత్ర వాక్యాన్ని చదివి వినిపించారు.

దేశంలోని పలు ప్రాంతాల నుండి తరలివచ్చిన క్రైస్తవుల కోసం కల్వరి చర్చి నిర్వాహకులు పెద్ద ఎత్తున అన్నదానం చేశారు. ఉపవాస దీక్షల ముగింపు కార్యక్రమానికి మాజీ కేంద్రమంత్రి డాక్టర్ సముద్రాల వేణుగోపాల చారి, మాజీ జడ్పిటిసి సభ్యులు కారుకూరి రా0చందర్, టిపిసిసి ప్రచార కమిటీ కన్వీనర్ నాతరి స్వామి, హైకోర్టు న్యాయవాది కాంపెల్లి ఉదయ్ కాంత్, కాసిపేట మండల కాంగ్రెస్ అధ్యక్షులు రత్నం ప్రదీప్ తో పాటు పలువురు పాల్గొన్నారు. ఎక్కడ ఇలాంటి గొడవలు జరగకుండా బెల్లంపల్లి ఏసిపి ఏ .రవికుమార్ ఆధ్వర్యంలో మందమర్రి, బెల్లంపల్లి టూ టౌన్, తాండూర్ సిఐలు శశిధర్ రెడ్డి, హనూక్, దేవయ్యలతో పాటు సబ్ డివిజన్ పరిధిలోని ఎస్సైలు గట్టి బందోబస్తు నిర్వహించారు.