16-10-2025 11:26:03 PM
ఎల్లారెడ్డి (విజయక్రాంతి): ఎల్లారెడ్డి పట్టణంలోని పరిసర ప్రాంతంలో పేకాట ఆడుతున్నారని పక్కా సమాచారంతో ఎల్లారెడ్డి ఎస్సై మహేష్ ప్రత్యేక మెరుపు దాడి చేశారు. నమ్మకమైన సమాచారం మేరకు ఎల్లారెడ్డి ఎస్ఐ మహేష్ తన సిబ్బందితో కలిసి లింగారెడ్డిపేట గ్రామ శివారులో గల గంగమ్మ గుడి సమీపంలో పేకాట స్థావరంపై దాడి నిర్వహించారు. ఈ దాడిలో 7 మంది వ్యక్తులు పట్టుబడగా, 5 మంది పారిపోయారు. స్థలంలో నుండి ₹1,920 నగదు, 9 బైక్‌లు, 6 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై, ఎల్లారెడ్డి ఎస్ఐ మహేష్, కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలిపారు.