10-11-2025 10:18:37 PM
వృద్ధాశ్రమాలలో పండ్లు,రైస్ బ్యాగ్స్ పంపిణీ..
ఫెడరేషన్ సభ్యులు 25 మంది రక్తదానం..
మేడిపల్లి (విజయక్రాంతి): బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ ఫెడరేషన్ చైర్మన్ డాక్టర్ రాపోలు రాములు జన్మదిన వేడుకలు ఫెడరేషన్ కార్యాలయంలో ఫెడరేషన్ కుటుంబ సభ్యులు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ కాలనీ సంక్షేమ సంఘం సమైక్య చైర్మన్ రాపోలు రాములు జన్మదినం సందర్భంగా, కార్యాలయంలో ఫెడరేషన్ కుటుంబ సభ్యులు కేక్ కట్ చేసి మాట్లాడుతూ,పేద ప్రజల సంక్షేమం కోసం నిరంతరం పరితపించే వ్యక్తి, ప్రజాబందు అవార్డు గ్రహీత, పేదల పెన్నిధి, దాదాపు 5 దశాబ్దాల కాలం నుండి ప్రజా సేవలో ఎలాంటి పదవులు ఆశించకుండా వివిధ పార్టీలలో అనేక రకాల అనుభవం కలిగిన రాజకీయ మేధావులతో పని చేసి ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ఫెడరేషన్ చైర్మన్ డాక్టర్ రాపోలు రాములుకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ జన్మదిన సందర్భంగా, కరుణారథం( కరుణా సదన్ ) చారిటబుల్ ట్రస్ట్ వృద్ధాశ్రమంలో, వృద్ధులకు పండ్ల పంపిణీ నిర్వహించారు, అలాగే రైస్ బ్యాగ్స్ ఇవ్వడం జరిగింది. ఫెడరేషన్ కుటుంబ సభ్యులు ఒక 25 మంది రక్తదానం చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం జన్మదిన సందర్భంగా సేవా దృక్పథంతో ముందుకు వెళుతున్న డాక్టర్ రాపోలు రాములు కొనియాడారు. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకుంటూ ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని ఫెడరేషన్ కుటుంబ సభ్యులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో,వైస్ చైర్మన్ ఏడ్ల శ్రీనివాస్ రెడ్డి.ముఖ్య సలహదారులు వెంకట్రావు.ప్రదాన కార్యదర్శి, గడ్డం యాదగిరి.వర్కింగ్ ప్రెసిడెంట్ బొల్లారం మహేష్, కోశాధికారి శ్రీనివాస్ గుప్తా, అధ్యక్షులు అబ్రహం లింకన్, కాలనీవాసులు, తదితరులు పాల్గొన్నారు.