calender_icon.png 27 September, 2025 | 8:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వరద బాధితులకు అండగా ప్రజా ప్రభుత్వం

27-09-2025 07:03:57 PM

మెదక్,(విజ‌య‌క్రాంతి): వరద బాధితులకు అండగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తోందని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావ్ అన్నారు. ఇటీవల మెదక్ జిల్లాలో కురిసిన భారీ వర్షాల వల్ల వరదల్లో కొట్టుకుపోయిన హవేలి ఘనపూర్ మండలానికి చెందిన ఇద్దరు బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున మొత్తం రూ.10 లక్షల చెక్కులను శనివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అందజేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... ప్రజల సంక్షేమమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. వరదల వల్ల నష్టపోయిన కుటుంబాలను ఆదుకునేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. పంటల నష్టంతో పాటు ఇతర ఆస్తి నష్టాలపై అధికారులు అంచనా వేశారన్నారు. భారీ వర్షాలు వచ్చే అవకాశం ఉన్నందున ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలన్నారు. అత్యవసరమైతేనే ఇళ్ల నుంచి బయటకు రావాలని కోరారు.