24-09-2025 07:02:17 PM
- మీపై పెట్టుకున్న నమ్మకం రెట్టింపు అయ్యేలా పని చేయండి
- పట్టణ టూ వీలర్స్ నూతన కార్యవర్గ సభ్యులను సన్మానించిన బీసీ సమాజ్ మోడల శ్రీనివాస్ సాగర్
మహబూబ్ నగర్,(విజయక్రాంతి): పదవి ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరికైనా బాధ్యతలను పెంచుతుందని బీసీ సమాజ్ జిల్లా అధ్యక్షులు మోడల శ్రీనివాస్ సాగర్ అన్నారు. బుధవారం పాలమూరు పట్టణ టూవీలర్స్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడు మురళి సాగర్, ఉపాధ్యక్షుడు కృష్ణ, రెండవ పట్టణ టూవీలర్స్ అసోసియేషన్ కోశాధికారి జగన్ ను బీసీ సమాజ్ రాష్ట్ర కార్యదర్శి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షుడు మోడల శ్రీనివాస్ సాగర్ ఎంవీఎస్ డిగ్రీ కాలేజ్ కళాశాల మైదానంలో వాకింగ్ మిత్ర బృందంతో కలిసి ఘనంగా సన్మానించారు. మీపై పెట్టుకున్న నమ్మకాన్ని రెట్టింపు అయ్యేలా పనిచేయాలని ఆయన కోరారు. ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి తమ సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రజలు, తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... మీ తోటి సభ్యుల పట్ల చేదోడు వాదోడుగా ఉంటూ వారి సమస్యలను పరిష్కరించే దిశగా అందరు ఐక్యమత్యంతో ముందుకెళ్లాలని ఆయన సూచించారు.