24-09-2025 06:58:04 PM
సుల్తానాబాద్,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర సాధనే ఏకైక లక్ష్యంగా తన పదవిని యావదాస్తిని తృణప్రాయంగా వదిలివేసి రాష్ట్ర సాధనే ఏకైక లక్ష్యంగా ఉద్యమించిన ఉద్యమ కెరటం కొండ లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని జిల్లా నడి బొడ్డున ఏర్పాటు చేసేందుకు పద్మశాలీలు సన్నాహక ఏర్పాట్లను చేపట్టారు. బుధవారం సుల్తానాబాద్ మండలంలోని కనుకుల, మున్సిపల్ పరిధిలోని సుల్తానాబాద్ ఎస్విఆర్ ఫంక్షన్ హాల్లో పద్మశాలీల ఆధ్వర్యంలో సమావేశాన్ని నిర్వహించారు.
దాసరి ఉష ఆధ్వర్యంలో ఈ నెల 27న కొండ లక్ష్మణ్ బాపూజీ 110 జయంతిని పురస్కరించుకొని జిల్లాలోని కమాన్ చౌరస్తాలో కొండ లక్ష్మణ్ బాపూజీ నిలువెత్తు కాంసా విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు ముందుకు రావడంతో జిల్లాలోని పద్మశాలీలందరూ ఐక్యంగా సమావేశమై విగ్రహ ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. ఉద్యమ నేత కొండ లక్ష్మణ్ బాపూజీని ప్రతి పద్మశాలి ఆదర్శంగా తీసుకోవాలని ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని పద్మశాలీలు తీర్మానించారు. జిల్లాలోని అన్ని గ్రామాల పద్మశాలీలు ఈనెల 27న పెద్దపెల్లిలో నిర్వహించే భూమి పూజకు హాజరుకావాలని కనీవిని ఎరుగని రీతిలో పద్మశాలీలు హాజరై ఐక్యతను చాటి కొండా లక్ష్మణ్ ఆశయంలో భాగస్వాములు కావాలని కోరారు.