23-01-2026 01:10:46 AM
బీసీని సస్పెండ్ చేసి ప్రభుత్వం అవమానిస్తోంది
తక్షణమే ప్రొఫెసర్‌ను విధుల్లోకి తీసుకోవాలి
బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
హైదరాబాద్, జనవరి 22 (విజయక్రాంతి): ఉస్మానియా విశ్వవిద్యాలయంలో అధ్యాపకుడిగా పని చేస్తున్న బీసీ సామాజిక వర్గానికి చెందిన ప్రొఫెసర్ మనోహర్‌ను అకారణంగా యూనివర్సిటీ యజమాన్యం సస్పెండ్ చేయడం అన్యాయమని బీసీ సంక్షే మ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ ప్రకటనలో తెలిపారు. కెరీర్ అడ్వాన్స్మెంట్ స్కీమ్ (క్యాష్) అమలులో ప్రమోషన్ పొందని యూనివర్సిటీ అధ్యాపకుల తరఫున ఉస్మానియా యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ (ఔటా) అధ్యక్షుడు ఆచార్య మనోహర్‌రావును సస్పెన్షన్ చేయడం ఎంతవరకు సమంజసం అని ఆయన ప్రశ్నించారు.
ప్రజాస్వామ్యబద్ధంగా ఉపాధ్యాయుల సమస్యలను వైస్‌చాన్సలర్, రిజిస్టార్ దృష్టికి తీసుకుపోయే బాధ్యత ఔటాకు ఉందన్నారు. సమస్యలను పరిష్కరించకుండా సస్పెండ్ చేయడమే పరిష్కారం అనుకోవడం యజమాన్యానికి తగదన్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న బీసీ, స్సీ, స్టీ ఐక్యతను దెబ్బతీయడానికి యూనివర్సిటీలో కొంతమంది, కొన్ని శక్తుల వారు కుట్ర చేస్తున్నారన్నారు. దీనికి యూనివర్సిటీ రిజిస్టర్ నరేష్‌రెడ్డి ఆజ్యం పోస్తున్నారని ఆరో పించారు. ప్రభుత్వం జోక్యం చేసుకుని ప్రొఫెసర్ మనోహర్‌ను తక్షణమే విధుల్లోకి తీసు కోవాలని జాజుల డిమాండ్ చేశారు.