calender_icon.png 22 October, 2025 | 7:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆసియాకప్ ట్రోఫీపై నఖ్వీకి బీసీసీఐ వార్నింగ్

22-10-2025 01:09:20 AM

ముంబై, అక్టోబర్ 21: టీమిండియా ఆసియాకప్ గెలిచి మూడు వారాలు దాటిపో యినా ట్రోఫీ మాత్రం ఇంకా చేతికి రాలేదు. దీనికి పీసీబీ ఛైర్మన్,ఆసియా క్రికెట్ కౌన్సిల్ ప్రెసిడెంట్ మోసిన్ నఖ్వీ ఓవరాక్షనే కారణం. ఆపరేషన్ సింధూర్ తర్వాత ఆసియాకప్‌లో పాక్‌తో మ్యాచ్‌ల సందర్భంగా భారత క్రికెట ర్లు వారితో కరచాలనం చేయలేదు. ఫైనల్లో నూ మ్యాచ్ గెలిచిన తర్వాత ఏసీసీ ప్రెసిడెంట్ నఖ్వీ నుంచి ట్రోఫీ తీసుకునేందుకు నిరాకరించారు.దీంతో ట్రోఫీ, మెడల్స్‌ను నఖ్వీ తన వెంట తీసుకెళ్లిపోయాడు.

తర్వాత దుబాయ్‌లోని ఏసీసీ కార్యాలయంలో ఉంచి ఎవ్వరికీ ఇవ్వొద్దంటూ ఆదేశాలిచ్చాడు. ఈ మొత్తం వ్యవహారంపై ఇప్పటికే పలుసార్లు ఆగ్రహం వ్యక్తం చేసిన బీసీసీఐ చివరిగా నఖ్వీకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. వీలైనంత త్వరగా ట్రోఫీని భారత్‌కు పంపకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తూ మెయిల్ పంపింది. నఖ్వీ దీనిపై స్పందించకుంటే ఐసీసీకి ఫిర్యాదు చేయనున్నట్టు బీసీ సీఐ తెలిపింది. అటు ఐసీసీ నుంచి కూడా నఖ్వీని సాగనంపేందుకు బీసీసీఐ పావులు కదుపుతోంది.