22-10-2025 07:22:41 PM
ఘట్ కేసర్ (విజయక్రాంతి): వెంకటాపూర్ లోని అనురాగ్ యూనివర్సిటీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగం, ఎ1 క్లబ్‌తో కలిసి, గూగుల్ డెవలపర్స్ ప్రోగ్రాం ఆధ్వర్యంలో “బిల్డ్ విత్ ఎ 1- ఎ గూగుల్ వర్క్‌షాప్” అనే కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమం డాక్టర్ ఎ. మల్లికార్జున రెడ్డి మార్గదర్శకత్వంలో ఫ్యాకల్టీ కో-ఆర్డినేటర్ జి. విక్టర్ డేనియల్ సమన్వయంతో సజావుగా జరిగింది. గూగుల్ డెవలపర్ ఎక్స్పర్ట్ ఇన్ మెషిన్ లెర్నింగ్ అయిన జయ్ ఠక్కర్ ఈ వర్క్‌షాప్‌కి ప్రధాన వక్తగా వ్యవహరించి, విద్యార్థులకు ఆధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, గూగుల్ క్లౌడ్ టెక్నాలజీలపై అనుభవాత్మక శిక్షణ అందించారు. వివిధ ఇంజనీరింగ్ విభాగాల నుండి 500కి పైగా విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని అత్యంత విజయవంతంగా నిలిపారు.