22-10-2025 06:48:56 PM
యాచారం: యాచారం మండల పరిధిలోని నల్లవెల్లి సబ్ స్టేషన్ 11 కేవి మరమ్మతులు రోడ్డుకు ఇరువైపులా విద్యుత్ తీగలకు ఆనుకొని ఉన్న చెట్లను తొలగించుట కోసం నేడు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు మండల విద్యుత్ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. మాల్, గ్రామంలో రైస్ మిల్లులు వ్యవసాయ పొలాలు, ఉదయం 11 నుండి 2 వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. కావున విద్యుత్ శాఖ సిబ్బందికి ఆయా గ్రామాల ప్రజలు సహకరించాలని కోరారు.