calender_icon.png 22 October, 2025 | 10:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నగేష్ కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత

22-10-2025 06:56:45 PM

చండూరు (విజయక్రాంతి): కార్యకర్తలకు బిఆర్ఎస్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు బొమ్మర బోయిన వెంకన్న అన్నారు. బుధవారం చండూరు మండల పరిధిలోని గుండ్రపల్లి గ్రామానికి చెందిన బిఆర్ఎస్ కార్యకర్త కురుపాటి నగేష్ ఇటీవల కాలంలో గుండెపోటుతో మరణించడంతో బిఆర్ఎస్ మండల పార్టీ నాయకులు వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కార్యకర్తకు ఏ కష్టం వచ్చినా బిఆర్ఎస్ పార్టీ ముందుంటుందని ఆయన అన్నారు.

వారి కుటుంబానికి మండల కమిటీ ఆధ్వర్యంలో 55వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు యత్తపు మధుసూదన్ రావు, బిఆర్ఎస్ నాయకులు ఉజ్జిని అనిల్ రావు, బొడ్డు సతీష్ గౌడ్, కురుపాటి సుదర్శన్, సామ్రాట్ కిరణ్, మహిళా అధ్యక్షురాలు పెండ్యాల గీత, జంగయ్య, కృపాటి లింగస్వామి, సురేష్, నాగరాజు, మహేశ్వరం వెంకన్న, లింగస్వామి తదితరులు పాల్గొన్నారు.