calender_icon.png 22 October, 2025 | 9:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సూపర్ ఓవర్‌లో గట్టెక్కిన విండీస్

22-10-2025 01:08:13 AM

రెండో వన్డేలో బంగ్లాపై విజయం

ఢాకా,అక్టోబర్ 21: వెస్టిండీస్,బంగ్లాదేశ్ మధ్య ఢాకా వేదికగా జరిగిన రెండో వన్డే ఉత్కంఠతో ఊపేసింది. స్పిన్ పిచ్‌పై ఓ మాది రి స్కోర్లు నమోదైన ఈ మ్యాచ్ మొదట టై అయింది. తర్వాత సూపర్ ఓవర్‌లో వెస్టిండీస్ విజయం సాధించింది. మొదట బ్యాటిం గ్‌కు దిగిన బంగ్లాదేశ్ 50 ఓవర్లలో 213/9 పరుగులు చేసింది. ఛేజింగ్‌లో వెస్టిండీస్ కూడా తడబడుతూనే సరిగ్గా 213 పరుగులే చేయగలిగింది. కెప్టెన్ షై హోప్ హాఫ్ సెంచరీతో పోరాడి విండీస్‌ను ఓటమి నుంచి తప్పించగలిగాడు.

మ్యాచ్ టై కావడంతో ఫలితం కోసం సూపర్ ఓవర్ నిర్వహించారు. సూపర్ ఓవర్ లో మొదట బ్యాటింగ్‌కు దిగిన విండీస్ 10 పరుగులు చేసింది. 11 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ ఒక దశలో గెలిచేలా కనిపించింది.అకిల్ హొస్సేన్ వైడ్‌తో పాటు నోబాల్ వేయడంతో విండీస్‌కు ఓటమి తప్పదని అంతా అనుకున్నారు. కానీ చివర్లో అతను అద్భుతంగా బౌలింగ్ చేయడంతో బంగ్లా 9 పరుగులే చేసి 1 పరుగు తేడాతో ఓడిపోయింది. ఈ విజయం తో మూడు వన్డేల సిరీస్‌ను విండీస్ 1 సమం చేసింది. సిరీస్ ఫలితా న్ని తేల్చే చివరి మ్యాచ్ గురువారం జరుగుతుంది. ఇదిలా ఉంటే ఈ మ్యాచ్‌లో విండీస్ అరుదైన రికార్డ్ సృష్టించింది. మొత్తం 50 ఓవర్లూ స్పిన్నర్లచేత వేయించిన తొలి పూర్తిస్థాయి సభ్యదేశంగా రికార్డులకెక్కింది.