calender_icon.png 22 October, 2025 | 9:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మెగా జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలి

22-10-2025 07:27:13 PM

తహాశీల్దార్ బాషపాక శ్రీకాంత్..

జాజిరెడ్డిగూడెం/అర్వపల్లి: ఈనెల 25న సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించే మెగా జాబ్ మేళాను గ్రామీణ ప్రాంత నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని జాజిరెడ్డిగూడెం మండల తహాశీల్దార్ బాషపాక శ్రీకాంత్ కోరారు. బుధవారం మండల కేంద్రం అర్వపల్లిలోని తహాశీల్దార్ కార్యాలయంలో ఎంపీడీఓ గోపితో కలిసి నిరుద్యోగులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే లక్ష్యంతో ఈ జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుందన్నారు. 10వ తరగతి, ఇంటర్, ఐటీఐ, డిప్లమో, డిగ్రీ, ఎంబీఏ, బీటెక్, పీజీ, ఫార్మసీ విద్యార్హతలు కలిగిన 18 నుంచి 40 ఏళ్ల లోపు వయస్సు కలిగిన నిరుద్యోగులు జాబ్ మేళాలో పాల్గొనవచ్చునని తెలిపారు.

సింగరేణి కాలనీస్ కంపెనీ లిమిటెడ్, తెలంగాణ డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ సాకారంతో 250 కంపెనీలలో ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు వెల్లడించారు. మండల కేంద్రం అర్వపల్లి నుండి నిరుద్యోగులకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడం జరిగుతుందని, నిరుద్యోగ యువత సకాలంలో హాజరై ఉపాధి అవకాశాలు పొందాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గిర్ధవార్లు జలంధర్ రావు, వెంకట్రెడ్డి, రెవెన్యూ సిబ్బంది, ఎంపీడీఓ కార్యాలయ సిబ్బంది, నిరుద్యోగలు తదితరులు పాల్గొన్నారు.