calender_icon.png 14 July, 2025 | 9:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీ బాంధవుడు సీఎం రేవంత్‌రెడ్డి

14-07-2025 01:21:13 AM

శాలిగౌరారం, జులై 13: బీసీ బాంధవుడు సీ ఎం రేవంత్ రెడ్డి అని టీపీసీసీ నాయకులు,మాజీ రాష్ట్ర అధికార ప్రతినిధి నూక కిరణ్ యాదవ్ అన్నారు. ఆదివారం తెలంగాణ సీ ఎం రేవంత్ రెడ్డి ని వారి నివాసం లో నూక కిరణ్ యాదవ్ మర్యాద పూర్వకంగా కలిశారు.

రాష్ట్రం లో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ లకు 42 % శాతం రిజర్వేషన్ లు కల్పిస్తూ ఆర్డినెన్స్ తీసుకొచ్చినందుకు బీసీ వర్గాల ప్రజల తరపున సీ ఎం రేవంత్ రెడ్డి కి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్,మంత్రి సురేఖ,ప్రభుత్వ విఫ్ అది శ్రీనివాస్,బీసీ సంఘాల నాయకుల తో కలిసి సీ ఎం రేవంత్ రెడ్డి ని సన్మానించారు. ఈ సందర్బంగా సీ ఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం పని చేయాలని సూచించినట్లు కిరణ్ యాదవ్ తెలిపారు.