14-07-2025 01:22:56 AM
ఎమ్మెల్యే మందుల సామేలు ,ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి
తుంగతుర్తి, జులై 13: ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని దానిలో భాగంగానే నూతన రేషన్ కార్డులను పంపిణీ చేస్తుందని ఎమ్మెల్యే మందుల సామేలు ఎంపీ చమల .కిరణ్ కుమార్ రెడ్డిలు అన్నారు. ఆదివారం తిరుమలగిరి పట్టణ కేంద్రంలోని ముఖ్యమంత్రి బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించి మాట్లాడారు.9 సంవత్సరాల కాలంలో బిఆర్‌ఎస్ పార్టీ పేద ప్రజలకు రేషన్ కార్డు ఇస్తానని చెప్పి ,మాయ మాటలతోనే కాలం గడిపారని ఎద్దేవా చేశారు.
భారతదేశంలోనే ఏ రాష్ట్రములో లేని సన్న బియ్యం ప్రజలకు పంపిణీ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టి, 13 వేల కోట్ల నిధులు ఖర్చు చేస్తున్నట్లు పేర్కొన్నారు. తెలంగాణలో ప్రస్తుతం 95 లక్షల కుటుంబాలకు సుమారు 3 కోట్ల 10 లక్షల మంది లబ్ధిదారులకు, రేషన్ కార్డుల ద్వారా సన్న బియ్యం లబ్ధి పొందన్నట్లు తెలిపారు. రైతుల ప్రయోజనాల దృష్ట్యా రుణమాఫీ, రైతు భరోసా, రైతు బీమా పథకాలను ప్రవేశపెట్టి, రైతు పండించిన పంటకు బోనస్ కల్పించిన ఘనత కాంగ్రెస్ పార్టీదే అన్నారు.
సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు జరిగే ముఖ్యమంత్రి బహిరంగ సభకు, మంత్రులు ఎమ్మెల్యే తో పాటు, హాజరవుతున్నారని, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కాగా అంతకుముందు కలెక్టర్ తేజస్ నందనాల్ పవర్ ఎస్పీ నరసింహలతో కలిసి సభ వేదికను పరిశీలించి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు