14-07-2025 01:19:34 AM
హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 13 (విజయక్రాంతి): తెలంగాణ సాంస్కృతిక వైభ వానికి ప్రతీకగా నిలిచే లష్కర్ బోనాల జా తర ఆదివారం అట్టహాసంగా ప్రారంభమైం ది. డప్పుల దరువులు, పోతరాజుల విన్యాసాలు, శివసత్తుల పూనకాలతో ఆలయ పరి సరాలు జనసంద్రంగా మారాయి. తెల్లవారుజాము నుంచే అమ్మవారి దర్శనానికి భక్తు లు పోటెత్తడంతో ఆలయ వీధులన్నీ కిక్కిరిసిపోయాయి.
తెల్లవారుజామునే ఆలయానికి వచ్చిన హైదరాబాద్ ఇన్‌చార్జ్ మంత్రి పొ న్నం ప్రభాకర్‌గౌడ్ కుటుంబసమేతంగా అమ్మవారికి తొలిబోనం సమర్పించారు. అమ్మవారికి మహాహారతి, కుంకుమ, పుష్పార్చన నిర్వహించారు. సాకలు సమర్పించి విశేష నివేదన చేశారు. రాష్ర్ట ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అమ్మవారికి బంగారు బోనం, పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. రాష్ర్ట ప్రభుత్వం తరఫున సీఎం అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు.
మంత్రులు కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ఎంపీ అనిల్‌కుమార్‌యాదవ్, ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి ఆలయానికి విచ్చేసిన సీఎం కు, గ్రేటర్ హైదరాబాద్ డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్‌రెడ్డి స్వాగతం పలికారు.
ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణకుంభంతో గౌరవించారు. అనంతరం సీఎం, మంత్రులు అమ్మవారిని దర్శించుకొని, రా ష్ర్ట ప్రజలు సుఖశాంతులతో వర్థిల్లాలని ప్రా ర్థించారు. అనంతరం అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులకు అనుమతించారు.
పటిష్ఠ బందోబస్తు..
లక్షలాదిగా తరలివచ్చే భక్తుల భద్రత కోసం పోలీసులు పకడ్బందీ ఏర్పాట్లు చేశా రు. హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సీ వీ ఆనంద్, ఇతర ఉన్నతాధికారులతో కలిసి ఆలయ పరిసరాలను స్వయంగా సందర్శించారు. భక్తుల క్యూలైన్లు, భద్రతా ఏర్పాట్లను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని చర్యలు తీసుకు న్నామన్నారు.
చైన్ స్నాచర్లు, జేబుదొంగలను అరికట్టేందుకు ప్రత్యేక క్రైమ్ బృం దా లు, షీటీమ్స్‌ను రంగంలోకి దించామని, 400 సీసీటీవీ కెమెరాలతో నిరంతరం ని ఘా కొనసాగిస్తున్నామన్నారు. బోనాల సం దర్భంగా హైదరాబాద్‌లో వైన్ షాపులు బం ద్ చేసినట్లు తెలిపారు. అయన వెంట జా యింట్ సీపీ ట్రాఫిక్ జోయల్ డెవిస్, నార్త్ జోన్ డీసీపీ రష్మి పెరుమాల్ సహా పలువు రు ఉన్నతాధికారులు ఉన్నారు.
భక్తులతో పోటెత్తిన ప్రాంగణం..
బోనాల పండుగ సందర్భంగా సికింద్రాబాద్ పరిసర ప్రాంతాలు భక్తులతో పోటె త్తాయి. తెల్లవారుజాము నుంచే ఆడపడుచు లు బోనాలతో అమ్మవారికి మొక్కులు చెల్లించేందుకు బారులు తీరారు. భక్తుల రద్దీని నియంత్రించేందుకు అధికారులు ప్రత్యేక క్యూ లైన్లను ఏర్పాటు చేశారు. సాయంత్రం జరిగిన ఫలహారం బండి ఊరేగింపు కనుల పండువగా సాగింది.
నేడు రంగం, ఘటాల ఊరేగింపు..
జాతరలో అత్యంత కీలకమైన ‘రం గం’ కార్యక్రమం సోమవారం ఉద యం జరగనుంది. మాతంగి అమ్మవారు పచ్చికుండపై నిలబడి భవిష్య వాణి వినిపిస్తారు. అనంతరం అంబారీపై అమ్మవారి ఘటాల ఊరేగింపుతో రెండ్రోజుల ఉత్సవాలు వైభవంగా ముగుస్తాయి.