16-08-2024 01:01:13 AM
ప్రజలకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పిలుపు
హైదరాబాద్, ఆగస్టు 15(విజయక్రాంతి): విభిన్న జాతులు ఉన్న దేశంలో ప్రజల మధ్య ఐకమత్యంపై అనేక అనుమానాలు ఉన్నప్పటికీ ఆ వైవిధ్యమే గొప్ప తమ బలమని నిరూపించుకున్నాని గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ పేర్కొన్నారు. గురువారం రాజ్‌భవన్‌లో జరిగిన స్వాతంత్య్ర వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ.. స్వాతంత్య్ర దినోత్సవం అనేది మన చరిత్రను పండగలా జరుపుకొనే సమయం అన్నారు. అదొక నిస్వార్థ త్యాగాల గాథగా అభివర్ణించారు. ప్రతి ఒక్కరూ దేశం పట్ల గర్వంగా ఉండాలని గవర్నర్ ప్రజలకు పిలుపునిచ్చారు. తెలంగాణతో పాటు దేశం కూడా వేగంగా అభివృద్ధి చెందడానికి అవిశ్రాంతంగా కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో గవర్నర్ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం, అధికారులు పాల్గొన్నారు.