calender_icon.png 19 November, 2025 | 2:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ ప్రోత్సాహంతో మహిళలు ముందడుగు

19-11-2025 01:19:26 PM

 ఫ్యాషన్ డిజైనింగ్ షాప్ ప్రారంభోత్సవం

మున్సిపల్ కమిషనర్ రమాదేవి

కోదాడ: ఇందిరా మహిళా శక్తి పథకం మహిళల ఆత్మనిర్బరతను పెంపొందించేందుకు  కోదాడ పట్టణంలోని తిరుమల హాస్పిటల్ ఆవరణంలో ఏర్పాటు చేసిన సరిత ఫ్యాషన్ డిజైనింగ్ మున్సిపల్ కమిషనర్ రమాదేవి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళా సంఘాల అభివృద్ధికి ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తోందని, స్వయం ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలని సూచించారు.

“మహిళలు ముందుకు వస్తే కుటుంబం, సమాజం ముందుకు సాగుతుంది” అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ప్రాంతీయ మహిళల్లో ఉత్తేజాన్ని నింపింది నమిత మెప్మా మహిళా సంఘానికి చెందిన సభ్యురాలు సోమపంగు సైదమ్మ ప్రోత్సాహంతో ఏర్పాటు చేసిన ఈ షాప్ ప్రారంభోత్సవంలో సీఓ వెంకన్న, డాక్టర్ ప్రమీల, తదితరులు పాల్గొన్నారు.