19-11-2025 01:16:33 PM
ఖానాపూర్ కాంగ్రెస్ నాయకులు
ఖానాపూర్,(విజయక్రాంతి): దేశానికి ఇందిరమ్మ నాయకత్వం ఆదర్శనీయమని ఆమె పాలనలోనే మహిళలకు, బడుగు బలహీనులకు సమన్యాయం జరిగిందని ఖానాపూర్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు నిమ్మల రమేష్ అన్నారు. ఇందిరాగాంధీ జయంతి ఉత్సవాలు ఖానాపూర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘనంగా జరిపారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నేతలు ఆత్మ చైర్మన్ తోట సత్యం, మాజీ మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం, అంకం రాజేందర్, మాజీ వైస్ చైర్మన్ కావలి సంతోష్, తదితరులు పాల్గొన్నారు.