calender_icon.png 19 November, 2025 | 2:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి చెక్కులు అందించిన ఎమ్మెల్సీ

19-11-2025 01:22:34 PM

కాగజ్నగర్,(విజయక్రాంతి): కాగజ్ నగర్ పట్టణంలోని ఎమ్మెల్సీ దండే విఠల్ నివాసం లో పెంచికలపేట్ గ్రామానికి చెందిన సుంకరి భాగ్య, సమీర్, కవితకి సీఎం సహాయనిధి చెక్కును ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్  అందజేశారు. ఈ సందర్భంగాఎమ్మెల్సీ మాట్లాడుతూ... సీఎం సహాయనిధి పథకం వల్ల పేద ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని పేర్కొన్నారు.ఆపద సమయంలో సంజీవినీలా పని చేస్తోందని పేదల ఆరోగ్యానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందనీ తెలిపారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.