16-08-2024 12:52:39 AM
ఉప ముఖ్యమంత్రి బట్టి
భద్రాద్రి కొత్తగూడెం, ఆగస్టు 15 (విజయక్రాంతి): ప్రజాప్రభుత్వం అవలంబిస్తున్న ప్రగతిశీల విధానాలు, ఆర్థిక క్రమశిక్షణ వల్ల గత 8 నెలల కాలంలో చేపట్టిన పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. గురువారం ఖమ్మం పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో జరిగిన స్వాతంత్ర దినోత్సవంలో ఆయన పాల్గొన్నారు. తెలంగాణలో ప్రజా ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమం రెండు కండ్లుగా ముందుకు సాగుతోందని చెప్పా రు.