19-11-2025 01:13:27 PM
జిల్లా అదనపు కలెక్టర్ రాజేశ్వర్ రావు
ఆదిలాబాద్,(విజయక్రాంతి): స్వామి వివేకానందున్ని యువత ఆదర్శంగా తీసుకోవాలని జిల్లా అడిషనల్ కలెక్టర్ రాజేశ్వర్ రావు అన్నారు. వివేకానంద 164వ జయంతిని పురస్కరించుకుని జాతీయ యువజనుల దినోత్సవం సందర్భంగా శ్రీ రామకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో విద్యార్థులకు నిర్వహించే వివేకానందునీ జీవితం-సందేశం పై పోటీ పరీక్షల పోస్టర్లను బుధవారం ఆయన చేతుల మీదుగా విడుదల చేసారు.
నేటితరానికి ఆదర్శనియుడైన స్వామి వివేకానంద జీవితం, వారిచ్చిన సందేశాన్ని విద్యార్థులు, యువత ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలన్నారు. ఆత్మవిశ్వాసంతో, గొప్ప పట్టుదలతో ఉన్నత శిఖరాలను చేరాలని దేశభక్తిని పెంపొందించుకోవాలని అదనపు కలెక్టర్ కోరారు. ఈ కార్యక్రమంలో సేవా సమితి ప్రధాన కార్యదర్శి కోరెడ్డి లెనిన్, సభ్యులు లంక హన్మండ్లు, గండ్రత్ సాయి, గణేష్ పాల్గొన్నారు.